Sunday, September 23, 2012

1953లో ఆంధ్ర రాష్ట్ర రాజధాని దుస్థితి ఇదీ


తెలంగాణ ఉద్యమ నేపధ్యంలో చాలా తరచుగా హైదరాబాదును మేమే అభివృద్ధి చేశామని సమైక్యవాదులు అవాకులు చవాకులు పేలుతుంటారు. అయితే హైదరాబాద్ నగరం ఆరేడు దశాబ్దాల క్రితమే ఒక మహానగరానికి కావలసిన అన్ని హంగులూ ఉన్న నగరం అనేది నిర్వివాదాంశం. అందుకు సకల సాక్ష్యాలూ ఉన్నాయి.
అసలు ఇంతకూ ఆంధ్ర రాష్ట్రపు రాజధానిగా మూడేండ్లు ఉన్న కర్నూల్ టౌన్ పరిస్థితి ఏమిటో ఇప్పటి తరంలో చాలా మందికి తెలియదు.
దీనికి కొంత నేపధ్యం తెలుసుకోవాలి.
ఆంధ్ర రాష్ట్ర అవతరణ సమయంలో అప్పటి నాయకులు మద్రాసు నగరం కొరకు పట్టుబట్టారు. మద్రాసులో తమిళులే అధికసంఖ్యలో ఉన్నప్పటికీ ప్రకాశం పంతులు వంటి నాయకుల మూర్ఖపు పట్టుదల వల్ల ఆంధ్ర రాష్ట్రపు ఏర్పాటు చాలాకాలం పాటే వాయిదా పడింది. చివరికి ఇదే డిమాండుతో పొట్టి శ్రీ రాములు ఆత్మ త్యాగం చేసినా ఆంధ్ర రాష్ట్రానికి మద్రాసు దక్కలేదు.
1930ల నుండే సాటి ఆంధ్ర వారితో కలిసి రావడానికి రాయలసీమ వారు ఇష్టపడలేదు. ఆంధ్రవారితో కలిసి ఒక రాష్ట్రంలో ఉండటం కన్నా తమిళులతో కలిసి అప్పటి మద్రాసు రాష్ట్రంలోనే కొనసాగడమే రాయలసీమ భవిష్యత్తుకు మంచిదని అక్కడి నాయకులు తలిచారు.
చివరికి ఆంధ్ర, రాయలసీమ నాయకుల మధ్య కుదిరిన ఒప్పందం మేరకు నూతన ఆంధ్ర రాష్ట్రానికి రాజధానిగా కర్నూల్ అవతరించింది.
అప్పటికి కర్నూల్ ఒక చిన్న టౌన్. ఏ విధమైన మౌలిక వసతులు లేవు. అన్ని ముఖ్య ఆఫీసులు, ఉద్యోగులు కూడా గుడారాలలోనే ఉండేవారు. సరైన పారిశుధ్యం, రోడ్లు లేక, వర్షం వస్తే బురదమయంగా మారే నల్ల రేగడి నేలల్లో నానా అవస్థలూ పడేవారు. అప్పటి పత్రికలు స్వయంగా కర్నూల్ ను డేరానగర్ గా వ్యవహరించేవారు. దినపత్రికల్లో ఈ డేరానగర్ దుస్థితి గురించి కార్టూన్లు కూడా వేసేవారు.
ఆ కాలం దినపత్రికల్లో వచ్చిన ఫొటోలు, వార్తలు చూస్తే మనకే అర్థం అవుతుంది ఆంధ్రరాష్ట్ర రాజధాని సొగసు ఎంతనో.
అప్పటికే అప్పుల్లో ఉన్న ఆంధ్ర రాష్ట్రం కర్నూల్ లో భవంతులు, వసతులు సమకూర్చుకునే పరిస్థితిలో లేదు. చివరికి డిల్లీ స్థాయిలో లాబీయింగ్ చేసి తెలంగాణను బలవంతంగా విలీనం చేసుకుని, అప్పటికే సర్వ హంగులతో సిద్ధంగా ఉన్న హైదరాబాదును చేజిక్కించుకున్నారు సీమాంధ్ర నాయకులు.
ఈసారి ఎవరైనా హైదరాబాదును మేమే అభివృద్ధి చేశామని సొల్లు వాగుడు వాగితే వారికి తెలంగాణతో విలీనమయ్యేనాటికి ఆంధ్ర రాజధాని దుస్థితిని ఎరుకపరచండి.






No comments: