Tuesday, September 10, 2013

తెలంగాణపై కేసీఆర్ ధీమా..

                                                    తెలంగాణపై కేసీఆర్ ధీమా..

ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడి తీరుతుందని తెరాస అధినేత కేసీఆర్ ధీమా వ్యక్తం చే్స్తున్నారు. హైదరాబాద్ రాజధానిగా పది తెలంగాణ జిల్లాలతో కూడిన రాష్ట్రమే కేంద్రం ఇస్తుందని. నిన్న కేకే నివాసంలో తెలంగాణ జేఏసీ అధ్యక్షుడు కోదండరాం, ఉద్యోగ సంఘాల నేతలు శ్రీనివాస్ గౌడ్, దేవీప్రసాద్, విఠల్, తెరాస ఎమ్మెల్యేలు హరీష్ రావు, ఈటెల రాజేందర్, వేణుగోపాల చారి, గంపగోవర్థన్ సమక్షంలో కేసీఆర్  ఢిల్లీ విషయాలను పంచుకున్నారు. అయితే ఏపీ ఎన్జీవోల సభ నేపధ్యంలో తెలంగాణ వాదులు ఏమాత్రం అప్రమత్తంగా లేకున్నా  రెండు వేల తొమ్మిది  డిసెంబర్ నాటి పరిణామాలు సంభవిస్తాయోమే అన్న అప్రమత్తత కలిగి ఉండాలని సూచించారు. దీంతో పాటు ఎన్టీఆర్ స్టేడియంలో ఐకాస నేతలు, ఉద్యోగ సంఘాలు, మేదావులు, జిల్లా ఐకాస నేతలతో   ఓ లక్ష మందితో భారీ సదస్సు నిర్వహించాలని నిర్ణయించారు. దీనిపై ఈ నెల  పన్నెండవ తేదీన జేఏసీ  విస్త్రృత స్థాయి సమావేశం నిర్వహించి దీనిపై తుది నిర్ణయం తీసుకోవాలని నేతలు తీర్మానించారు. అయితే ఈ సదస్సు ఈ నెల ఇరవై రెండవ తేదీ లేదా ఇరవై తొమ్మిదవ తేదీన నిర్వహించాలని జేఏసీ నేతలు భావిస్తున్నారు.
హైదరాబాద్ పై కొర్రీలు పెడితే నష్టం కాంగ్రెస్ కే....
తెలంగాణ రాష్ట్రం ఇచ్చేక్రమంలో హైదరాబాద్ పై కేంద్రం ఏదైనా కొర్రీలు పెడితె నష్టపోయేది కాంగ్రెస్ పార్టీయే  అన్నది తెరాస నేతల విశ్లేషణ. సీమాంధ్రలో నష్టపోతున్న తరుణంలో కాంగ్రెస్ హైదరాబాద్ యూటీ చేయాలన్నా, ఉమ్మడి శాశ్వత రాజధాని చేయాలని భావించినా అది తెలంగాణ ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత జనించడం ఖాయం. అదే జరిగితే  సీమాంధ్రలో జరిగే రాజకీయంగా నష్టపోవడంతో పాటు, తెలంగాణ రాష్ట్రం ఇచ్చి మరీ నష్టపోవాల్సివస్తుంది. హైదరాబాద్ పై మడత పేచీని తెలంగాణ సమాజం అంగీకరించదన్న ఆలోచన కాంగ్రెస్  అధిష్టానంలో ఉన్నట్లు తెరాస భావిస్తోంది.

No comments: