Saturday, September 14, 2013

    హైదరాబాద్ పై పూర్తి అధికారాలు తెలంగాకే...సీమాంధ్రకు తాత్కాలిక రాజదాని మాత్రమే...కోదండరాం



హైదరాబాద్ పై పూర్తి అధికారాలు తెలంగాణకే చెందెలా కేంద్రం నిర్ణయం తీసుకోవాలని తెలంగాణ జేఏసీ విస్తృత  స్థాయి సమావేశంలో తీర్మానించారు. హైదరాబాద్ ను పదేళ్ల ఉమ్మడి రాజధానిగా...సీమాంధ్ర ప్రాంతంతో పంచుకునేది లేదన్నారు. కేవలం సీమాంధ్ర ప్రాంతానికి ఏ అధికారాలు లేకుండా పరిమిత కాలంలో తాత్కాలిక రాజధానిగా మాత్రమే అంగీకరిస్తామని జేఏసీ తెలిపింది. నాంపల్లి..ఖైరతాబాద్ నియోజకవర్గాల్లో మాత్రమే ప్రభుత్వ కార్యాలయాలు ఉన్నాయని.. అంత వరకు మాత్రమే సీమాంధ్ర పాలకులు వినియోగించుకోవాలని జేఏసీ నేతలు ఇవాల నాచారంలో జరిగిన విస్తృత స్థాయి సమావేశంలో  అభిప్రాయాలు వ్యక్తం చేశారు.

                          సకల జన భేరి... ఈ నెల ఇరవై తోమ్మిదిన నిజాం కళాశాల మైదానంలో..



 ఈ నెల ౩౦వ తేదీన నిర్వహించాలనుకున్న సదస్సు పేరు..తేదీ..స్థలాన్ని మార్చుతూ జేఏసీ విస్తత స్థాయి సమవేశం నిర్ణయం తీసుకుంది. జేఏసీ నిర్వహించాలనుకున్న సదస్సును ఆదివారం ఇరవై తోమ్మిదిన నిజాం కళాశాల మైదానంలో నిర్వహించనున్నారు. ఈ సదస్సుకు సకల జనుల భేరిగా నామకరణం  చేశారు. ఈ సదస్సును విజయవంతం చేసేందుకు పది జిల్లాలలో సన్నాహక సమర భేరి పేరుతో సదస్సులు నిర్వహించనున్నారు.  ఈ సదస్సుకు ప్రభుత్వం అనుమతి ఇవ్వాల్సిందేనని ఈ సమావేశంలో  కోదండరాం చెప్పారు.

No comments: