Saturday, September 14, 2013

    హైదరాబాద్ పై పూర్తి అధికారాలు తెలంగాకే...సీమాంధ్రకు తాత్కాలిక రాజదాని మాత్రమే...కోదండరాం



హైదరాబాద్ పై పూర్తి అధికారాలు తెలంగాణకే చెందెలా కేంద్రం నిర్ణయం తీసుకోవాలని తెలంగాణ జేఏసీ విస్తృత  స్థాయి సమావేశంలో తీర్మానించారు. హైదరాబాద్ ను పదేళ్ల ఉమ్మడి రాజధానిగా...సీమాంధ్ర ప్రాంతంతో పంచుకునేది లేదన్నారు. కేవలం సీమాంధ్ర ప్రాంతానికి ఏ అధికారాలు లేకుండా పరిమిత కాలంలో తాత్కాలిక రాజధానిగా మాత్రమే అంగీకరిస్తామని జేఏసీ తెలిపింది. నాంపల్లి..ఖైరతాబాద్ నియోజకవర్గాల్లో మాత్రమే ప్రభుత్వ కార్యాలయాలు ఉన్నాయని.. అంత వరకు మాత్రమే సీమాంధ్ర పాలకులు వినియోగించుకోవాలని జేఏసీ నేతలు ఇవాల నాచారంలో జరిగిన విస్తృత స్థాయి సమావేశంలో  అభిప్రాయాలు వ్యక్తం చేశారు.

                          సకల జన భేరి... ఈ నెల ఇరవై తోమ్మిదిన నిజాం కళాశాల మైదానంలో..



 ఈ నెల ౩౦వ తేదీన నిర్వహించాలనుకున్న సదస్సు పేరు..తేదీ..స్థలాన్ని మార్చుతూ జేఏసీ విస్తత స్థాయి సమవేశం నిర్ణయం తీసుకుంది. జేఏసీ నిర్వహించాలనుకున్న సదస్సును ఆదివారం ఇరవై తోమ్మిదిన నిజాం కళాశాల మైదానంలో నిర్వహించనున్నారు. ఈ సదస్సుకు సకల జనుల భేరిగా నామకరణం  చేశారు. ఈ సదస్సును విజయవంతం చేసేందుకు పది జిల్లాలలో సన్నాహక సమర భేరి పేరుతో సదస్సులు నిర్వహించనున్నారు.  ఈ సదస్సుకు ప్రభుత్వం అనుమతి ఇవ్వాల్సిందేనని ఈ సమావేశంలో  కోదండరాం చెప్పారు.

హైదరాబాద్ ఉమ్మడి రాజధాని కాదు... తాత్కాలికం మాత్రమే....టీజేఏసీ

                                               హైదరాబాద్ తాత్కాలిక  రాజధాని మాత్రమే.....



 హైదరాబాద్ ను పదేళ్లపాటు తాత్కాలిక రాజధానిగా అంగీకరించ వద్దన్న ఒత్తిడి జేఏసీ నేతలపై పెరుగుతోంది. ఉద్యోగులు, విద్యార్థులు, తెలంగాణ వాదులు, జిల్లాల జేఏసీ నేతల నుంచి కోదండరాం, సహా ఇతర జేఏసీ ముఖ్యనేతలకు ఈ మేరకు అధిక సంఖ్యలో ఫోన్లు, ఎస్.ఎం.ఎస్ ల తాకిడి రోజు పెరుగుతోంది. ఎపీఎన్జీవోల హైదరాబాద్ సభ తర్వాత ఇది మరింత ఎక్కువయిందని నేతలు చెబుతున్నారు. పదేళ్ల రాజధానిగా ఇక ఏమాత్రం అంగీకరించవద్దని, కేవలం తాత్కాలిక రాజధానిగా ఎలాంటి టైంబాండ్ లేకుండా కేంద్రంపై ఒత్తిడి తేవాలని జేఏసీ నేతలు తెలంగాణ నుంచి వివిధ వర్గాలు ఒత్తిడి చేస్తున్నాయి. ఏపీఎన్జీవోల సభ సందర్భంగా విద్యార్థులపై పోలీసులు లాఠీ ఛార్జి, విద్యార్థి నేత బాలరాజు గౌడ్ పై  ఏపీఎన్జీవోల సభకు వచ్చిన వారి దాడి, ఆ సభలో ప్రసంగాలు, కానిస్టేబుల్ శ్రీనివాస్్ గౌడ్ దాడి, వంట ిఅంశాలు తెలంగాణ వాదుల్లో ఆగ్రహాన్ని నింపాయి. నేతలు సైతం పదేళ్ల ఉమ్మడి రాజధానికి అంగీకరించ కూడదన్న అభిప్రాయంలో ఉన్నారు. ఇప్పుడు కేంద్రం చెప్పిన వాటన్నింటికి మౌనంగా ఉంటే ఉమ్మడి రాజధాని నుంచి శాశ్వత రాజధానిగా కూడా ప్రకటించే అవకాశం ఉందని భావిస్తున్నారు.  ఇక హైదరాబాద్ ఆదాయం, శాంతిభధ్రతల అంశాల వంటి వాటిపైన సీమాంధ్ర నేతలు హాక్కులు కోరతారని.... ఇందుకు తాము సిద్ధంగా లేమని జేఏసీ నేతలు చెబుతున్నారు. అందుకే తాత్కాలిక రాజధానిగానే అంగీరించేందుకు సిద్ధమన్నది జేఏసీ ముఖ్య నేతల యోచన.

జేఏసీ నేతలు ఢిల్లీ పర్యటన

                                           తెలంగాణ రాజకీయ జేఏసీ విస్తృత స్థాయి సమావేశం




 తెలంగాణ రాజకీయ ఐకాస విస్తృత స్థాయి సమావేశం నాచారంలోని నోమా  ఫంక్షన్ హాలులో ప్రారంభమైంది. ఈ సమావేశానికి జేఏసీ ఛైర్మన్ కోదండరాం, తెరాస నేతలు కేకే, శ్రవణ్, ఈటెల రాజేందర్, ఉద్యోగ సంఘాల నేతలు దేవీప్రసాద్, శ్రీనివాస్ గౌడ్, విఠల్,  తెలంగాణ మాల మహనాడు అధ్యక్షుడు అద్దంకి దయాకర్, తెలంగాణ పది జిల్లాల జిల్లా జేఏసీ అధ్యక్షులు పాల్గొన్నారు.
ఢిల్లీ పర్యటనపై చర్చ...
 జేఏసీ నేతలు ప్రస్తుత తాజా రాజకీయ పరిణామాల నేపధ్యంలో ఢిల్లీకి వెళ్లి మరో మారు వివిధ పార్టీల జాతీయ నేతలను కలవాలని నిర్ణయించుకున్నారు. తెలంగాణకు అనుకూలంగా ఉన్న పార్టీల నేతలను కలిసి కాంగ్రెస్ తెలంగాణ బిల్లు పెట్టాలా ఒత్తిడి తేవాలని కోరనున్నారు. అయితే ఎవరేవరని కలవాలని.... ఢిల్లీకి వెళ్లే బృందంలో సభ్యులు ఎవరు ఉండాలన్న అంశాలపై ఇవాళ జరిగే  జేఏసీ సమావేశంలో చర్చించనున్నారు.
సెప్టెంబర్ ౩౦వ తేదీ సదస్సు
 ఈ నెల ౩౦వ తేదీన హైదరాబాద్ లోని ఎన్టీఆర్ స్టేడియంలో నిర్వహించ తలపెట్టిన స్వాభిమాన్ సదస్సు నిర్వహణపైన ఇవాళ్టి సమావేశంలో నేతలు చర్చిస్తారు. ఎన్టీఆర్ స్టేడియంలో ప్రభుత్వం సదస్సు నిర్వహణకు అనుమతి ఇస్తుందా..? లేదా...? ఇవ్వకపోతే సదస్సు వేదిక హైదారాబాద్లో మరో చోట ఎక్కడ నిర్వహించాలన్న అంశాలు... ఈ వేదిక నుంచి  కేంద్ర ప్రభుత్వం ముందు ఎలాంటి డిమాండ్ ఉంచాలి...... ఈ వేదిక ద్వారా తెలంగాణ ప్రజలకు ఎలాంటి సందేశం అందించాలన్న అంశాలపైన నేతలు చర్చిస్తారు. లక్ష మందితో నిర్వహించాలనుకున్న సదస్సులో రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాలు, ఉద్యోగ సంఘాల నేతల పాత్ర ఎలా..? ఉండాలి అన్న అంశాలపై జేఏసీ నేతలు ఓ నిర్ణయానికి రానున్నారు.

Friday, September 13, 2013

                             హైదరాబాద్ పదేళ్ల ఉమ్మడి రాజధానిపై తెలంగాణ జేఏసీ సమీక్ష..



 తెలంగాణ జేఏసీ విస్తృత స్థాయి సమావేశం నాచారంలోని నోమా  ఫంక్షన్ హాలులో శనివారం జరగనుంది.  ఈ సమావేశంలో తెలంగాణలోని పది జిల్లాల జేఏసీ నేతలు హాజరవుతారు. జేఏసీ ఛైర్మన్ కోదండరాం నేతృత్వంలో జరిగే ఈ విస్తృత స్థాయి సమాశంలో ఉద్యోగ సంఘాల నేతలు దేవీప్రసాద్, శ్రీనివాస్ గౌడ్,విడల్, పది జిల్లాల జేఏసీ నేతలు హజరవనున్నారు. ఇక తెరాస అధ్యక్షుడు కేసీఆర్, బీజేపీ అధ్యక్షుడు కిషన్  రెడ్డి, న్యూడెమెక్రసీ నేతలు సూర్యం,గోవర్థన్ సైతం హాజరవనున్నారు.ఈ సమావేశం రెండు విడతలుగా జరగనుంది. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు జిల్లా జేఏసీ నుంచి సలహాలు,సూచనలను స్వీకరిస్తారు. ఉద్యమ తీరుతెన్నులు, హైదరాబాద్ పదేళ్ల ఉమ్మడి రాజధానిగా అంగీరించాలా వద్దా... అన్న అంశంపైనే ప్రధానంగా చర్చిస్తారు. హైదరాబాద్ లో ఏపీఎన్జీవోల సభ తర్వాత జిల్లా జేఏసీల నుంచి కోదండరాం సహా జేఏసీ ముఖ్యనేతలపై  హైదరాబాద్ ను పదేళ్ల ఉమ్మడి రాజధానిగా  అంగీకరించవద్దని  ఒత్తిడి మొదలయింది. దీంతో జేఏసీ నేతలు పునారాలోచనలో పడ్డారు. ఈ సమావేశంలో చర్చించాక హైదరాబాద్ ను ఉమ్మడి రాజధానిగా అంగీకరించబోమని  చెప్పింనా ఆశ్చర్యంలేదని జేఏసీ నేతలు తమ అంతర్గత సంభాషణల్లో చెబుతున్నారు. ఇక మధ్యాహ్నం నుంచి జరిగే సమావేశంలో జిల్లా జేఏసీల నుంచి  వచ్చిన సలహాలు - సూచనలపై చర్చిస్తారు. ఆ తరువాత హైదరాబాద్ లో ఈ నెల ౩౦వ తేదీన నిర్వహించ తలచిన సదస్సు పనులపై చర్చించనున్నారు. ఈ సదస్సుకు తెలంగాణ స్వాభిమాన సదస్సు అన్న పేరుతో పిలవాలని ఆలోచిస్తున్నారు. అయితే దీనిపైన చర్చిస్తారు. ఇక  ఈ సదస్సు వేదిక  ఎన్డీఆర్ స్డేడియంలో నిర్వహించాలని తలస్తున్నారు. అనుమతులు రాకపోతే  ప్రత్యామ్నాయ వేదికలపైన చర్చిస్తారు.

Thursday, September 12, 2013

                                                తెలంగాణ హైదరాబాద్ ఐకాస సమావేశం నేడు..


తెలంగాణ రాజకీయ జేఏసీ నేతృత్వంలో హైదరాబాద్ జేఏసీ నేతలు నేడు సమావేశం కానున్నారు. హైదరాబాద్ పై సీమాంధ్రులు పేచీ పెడుతున్న నేపధ్యంలో జేఏసీ నేతల ప్రాధాన్యతను సంతరించుకంది. హైదరాబాద్ పై  ఏ రకమైన ఆంక్షలు విధించకుండా తెలంగాణ రాజధానిగా మాత్రమే ఉంచే రీతిలో ఉద్యమాన్ని నిర్వహించాలని జేఏసీ   అభిప్రాయం. ఈ మేరకు నేతలు   ఇవాళ సమావేశంలో హైదరాబాద్ సిర్ఫ్ హమారా అన్న నినాదంతో ముందుకు వెళ్లనున్నారు.   ఈ సమావేశం తర్వాత   ఈ నెల పధ్నాల్గవ తేదీన నాచారంలోని నోమా ఫంక్షన్ హాలులో జేఎసీ విస్తృత స్థాయి సమావేశం జరగనుంది. ఇందులో  తెరాస, బీజేపీ, న్యూడెమెక్రసీ, జిల్లా జేఏసీ నేతలు,ఉద్యోగ, ప్రజాసంఘాలు, కేసీఆర్  హజరుకానున్నారు. లక్ష మందితో ఈ నెల ౩౦ల తేదీన  నిర్వహించతలచిన తెలంగాణ స్వాభిమాన సదస్సు విషయాన్ని ఈ రెండు సమావేశాల్లో ప్రదానంగా చర్చిస్తారు.

Tuesday, September 10, 2013

హైదరాబాద్ ఉమ్మడి రాజదానిపై జేఏసీ అధ్యక్షుడు కోదండరాం సంచలన వ్యాఖ్యలు

                    హైదరాబాద్ ఉమ్మడి రాజదానిపై జేఏసీ అధ్యక్షుడు కోదండరాం సంచలన వ్యాఖ్యలు


హైదరాబాద్ ఉమ్మడి రాజదానిపై జేఏసీ అధ్యక్షుడు కోదండరాం సంచలన వ్యాఖ్యలు చేశారు .  హైదరాబాద్ ను ఉమ్మడి రాజధానిపై కోదండరాం స్వరం మార్చారు. పదేళ్ల పాటు ఉమ్మడి రాజధానిగా అంగీకరించం  అని కోదండరాం స్పష్టం చేశారు.  ఇవాళ తెలంగాణ రాజకీయ ఐకాస  స్టీరింగ్ కమిటీ హైదరాబాద్ లోని జేఏసీ కార్యాలయంలో సమావేశం అయింది. తెరాస, బీజేపీ, న్యూడెమెక్రసీ పార్టీలతో పాటు ఉద్యోగ సంఘాల నేతలు  శ్రీనివాస్ గౌడ్, దేవీప్రసాద్, విఠల్, ప్రజసంఘాల నేలు  అద్దంకిదయాకర్, రమసయి బాలకిషన్ పాల్గొన్నారు. కోదండరాం మాటల్లో చేప్పాలంటే...
మడి రాజధానిగా అంగీకరించే పరిస్థితులు కనపడటం లేదు. మాపై తెలంగాణ వాదుల  ఒత్తిడి అధికం అవుతుంది. హైదరాబాద్ ను ఉమ్మడి రాజదానిగా అంగీకరించవద్దని తెలంగాణా వాదులు కోరుతున్నారు. ఇది ఆయన చేసిన వ్యాఖ్యలు. తెలంగాణ స్వాభిమాన సదస్సును  ఈ నెల ౩౦వ తేదీన నిర్వహించాలని జేఏసీ నేతలు నిర్ణయించారు.

తెలంగాణ జేఏసీ సమావేశం ఇవాళ మధ్యాహ్నం మూడున్నరకు.

 తెలంగాణ జేఏసీ సమావేశం ఇవాళ  మధ్యాహ్నం మూడున్నరకు..

తెలంగాణ రాజకీయ ఐకాస స్టీరింగ్ కమిటీ  ఇవాళ మద్యాహ్నం  మూడున్నరకు సమావేశం  కానున్నారు.  ఈ నెల పన్నెండవ తేదీన జరిగే విస్తృత స్థాయి స్టీరింగ్ కమిటీ సమావేశం... ఎజెండా...ను ఇందులో చర్చిస్తారు. ఈ నెల ఇరవై రెండు లేదా ఇరవై తొమ్మిదవ తేదీన జెఏసీ నేతృత్వంలో ఎన్టీఆర్ స్టేడియంలో లక్ష మందితో సదస్సు నిర్వహించాలని ఆలోచిస్తున్నారు. దీనిపైన చర్చిస్తారు. ఈ సదస్సుకు తెలంగాణ స్వాబిమాన సదస్సు అనే పేరును నామకరణం చేయనున్నట్లు తెలిసింది.  మద్యాహ్నం మూడున్నరకు జరిగే ఈ స్టీరింగ్ కమిటీలో ఈ అంశాలపై స్థూలంగా చర్చిస్తారు. ఇందులో చర్చించిన అంశాలను విస్తృత స్థాయి సమావేశంలో జిల్లా జేఏసీ నేతల నడుమ తుది నిర్ణయం తీసుకుంటారు.

తెలంగాణపై కేసీఆర్ ధీమా..

                                                    తెలంగాణపై కేసీఆర్ ధీమా..

ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడి తీరుతుందని తెరాస అధినేత కేసీఆర్ ధీమా వ్యక్తం చే్స్తున్నారు. హైదరాబాద్ రాజధానిగా పది తెలంగాణ జిల్లాలతో కూడిన రాష్ట్రమే కేంద్రం ఇస్తుందని. నిన్న కేకే నివాసంలో తెలంగాణ జేఏసీ అధ్యక్షుడు కోదండరాం, ఉద్యోగ సంఘాల నేతలు శ్రీనివాస్ గౌడ్, దేవీప్రసాద్, విఠల్, తెరాస ఎమ్మెల్యేలు హరీష్ రావు, ఈటెల రాజేందర్, వేణుగోపాల చారి, గంపగోవర్థన్ సమక్షంలో కేసీఆర్  ఢిల్లీ విషయాలను పంచుకున్నారు. అయితే ఏపీ ఎన్జీవోల సభ నేపధ్యంలో తెలంగాణ వాదులు ఏమాత్రం అప్రమత్తంగా లేకున్నా  రెండు వేల తొమ్మిది  డిసెంబర్ నాటి పరిణామాలు సంభవిస్తాయోమే అన్న అప్రమత్తత కలిగి ఉండాలని సూచించారు. దీంతో పాటు ఎన్టీఆర్ స్టేడియంలో ఐకాస నేతలు, ఉద్యోగ సంఘాలు, మేదావులు, జిల్లా ఐకాస నేతలతో   ఓ లక్ష మందితో భారీ సదస్సు నిర్వహించాలని నిర్ణయించారు. దీనిపై ఈ నెల  పన్నెండవ తేదీన జేఏసీ  విస్త్రృత స్థాయి సమావేశం నిర్వహించి దీనిపై తుది నిర్ణయం తీసుకోవాలని నేతలు తీర్మానించారు. అయితే ఈ సదస్సు ఈ నెల ఇరవై రెండవ తేదీ లేదా ఇరవై తొమ్మిదవ తేదీన నిర్వహించాలని జేఏసీ నేతలు భావిస్తున్నారు.
హైదరాబాద్ పై కొర్రీలు పెడితే నష్టం కాంగ్రెస్ కే....
తెలంగాణ రాష్ట్రం ఇచ్చేక్రమంలో హైదరాబాద్ పై కేంద్రం ఏదైనా కొర్రీలు పెడితె నష్టపోయేది కాంగ్రెస్ పార్టీయే  అన్నది తెరాస నేతల విశ్లేషణ. సీమాంధ్రలో నష్టపోతున్న తరుణంలో కాంగ్రెస్ హైదరాబాద్ యూటీ చేయాలన్నా, ఉమ్మడి శాశ్వత రాజధాని చేయాలని భావించినా అది తెలంగాణ ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత జనించడం ఖాయం. అదే జరిగితే  సీమాంధ్రలో జరిగే రాజకీయంగా నష్టపోవడంతో పాటు, తెలంగాణ రాష్ట్రం ఇచ్చి మరీ నష్టపోవాల్సివస్తుంది. హైదరాబాద్ పై మడత పేచీని తెలంగాణ సమాజం అంగీకరించదన్న ఆలోచన కాంగ్రెస్  అధిష్టానంలో ఉన్నట్లు తెరాస భావిస్తోంది.

Monday, September 9, 2013

సెప్టెంబర్ ఏడవ తేదీన హైదరాబాద్ లోని ఎల్బీ స్టేడియంలో ఎపీఎన్జీవోలు నిర్వహించిన సభలో వక్తలు లేవనెత్తిన ప్రశ్నలకు ఓ తెలంగాణ జర్నలిస్టు ఇచ్చిన సమాధానాలు


సమైక్యాంద్ర సభలో వక్తల ప్రశ్నలు.. నా ఆన్సర్స్..
1. తెలంగాణ ఎందుకంటే సరైన కారణాలు చెప్పడం లేదు..
జవాబు... సింపుల్ 1956కి ముందు మాదో రాష్ట్రం, మీదో రాష్ట్రం.. షరతులతో ఏపీ పేరుతో కలిశామ్.. ఒప్పందాలు అమలు కాలేదు. అందుకే మా రాష్ట్రం మాకు కావాలంటున్నాం.
2. రాష్ట్రం విడిపోతే.. సీమాంద్ర ఉద్యోగులు నష్టపోతారు..
జవాబు.. తెలంగాణ దేశంలో 29 రాష్ట్రంగా ఏర్పడబోతోంది.. మిగతా రాష్ట్రాలు విడిపోయినప్పుడు ఫాలో అయిన విధానాలే ఇప్పుడు అమలు చేస్తారు. అయినా.. తెలుగుజాతి అనేవారు..సొంత ప్రాంతంలో ఉద్యోగం చేయమని చెప్పడంలోనే వారి బండారం బయటపడుతోంది.
3. నీళ్లు రావు..సీమాంద్ర ఎడారవుతుంది.
జవాబు.. నైలు నదిని 8దేశాలు..ఇండియా పాకిస్తాన్ లు 5 నదులను పంచుకుంటున్నాయి.. తెలంగాణ, సీమాంద్రలు పంచుకోలేవా.. సీమాంద్ర ఎందుకు ఎడారవుతుంది..కలుసున్నప్పుడు ఉత్తరాంద్ర, సీమలు ఎందకు కరువులో ఉన్నాయి..57 ఏళ్ల సమైక్య ఫలితమే కదా..
4. తెలంగాణ ఏర్పడితే..హైద్రాబాద్ 10ఏళ్లు ఉమ్మడి రాజధాని అయితే.. మాకు రక్షణేది.
జవాబు... సీమాంద్ర ప్రజలు దేశప్రజలే. వారికి ప్రత్యేక రక్షణలెందుకు., మద్రాస్ కెల్లి వచ్చేటప్పుడు మీరు కనీసం ఒక్కరోజు కూడా మద్రాస్ లో ఉమ్మడిగా లేరు..ఇప్పుడు 10ఏళ్లు ఉమ్మడిగా ఉండొచ్చు.
5. విడిపోతే.. ఆర్టీసి సీమాంద్రలో రెండు రోజుల్లో మూత పడుతుంది.
జవాబు.. మీ మాటలు 100% కరెక్ట్.., తెలంగాణలో వచ్చే లాభాలతోనే ఆర్టీసి నడుస్తుందని నిజాన్ని చెప్పినందుకు ధ్యాంక్స్..
6. తెలుగజాతి ఐక్యత దెబ్బతింటుంది..
జవాబు.. తెలుగుభాషకు వచ్చే నష్టమేమి లేదు.. 57ఏళ్ల నుంచి భాష పేరుతో తెలంగాణ వంచించిన వారికి ఐక్యత గురించి మాట్లాడే రైట్ ఉందా..
7. హైద్రాబాద్ మాది..మేం వచ్చి డెవలప్ చేశాం..
జవాబు.. హైద్రాబాద్ మీరు రాక ముందే 400ఏళ్ల కిందే తెలంగాణను పాలించిన రాజ్యాలకు రాజధాని. అయినా. 1956లో మీరు మద్రాస్ నుంచి విడిపోయినంక..మద్రాస్ డెవలప్ మెంట్ ఆగిపోయిందా.., ఇప్పుడు విడిపోతే బతకలేమంటున్నారు..మరి హైద్రాబాద్ ను డెవలప్ చేసే ధనం మీదగ్గర ఎట్లా ఉంది.
8. చిన్న రాష్ట్రాలతో డెవలప్ మెంట్ కుంటుపడుతుంది.
జవాబు.. చిన్నరాష్ట్రాలే దేశంలో అబివృద్దిలో ముందున్నాయనే గణాంకాలు ఎన్నో.. భాషా ప్రయుక్త రాష్ట్రాల సిద్దాంత మంటూ మాట్లాడే సిపిఎం పాలించిన వెస్ట్ బెంగాల్ విస్తీర్ణం..తెలంగాణ విస్తీర్ణం దాదాపుగా సమానం.
9. బతుకమ్మ తెలంగాణ వారి పండుగ కాదు.. (సత్యవాణి డౌట్)
జవాబు.. నిస్సందేహాంగా తెలంగాణకే ఆభరణమైన గొప్ప పండుగ..ఇంకా ఏ ప్రాంతంలో జరుపుతున్నారో సీమాంద్ర వారు నిరూపించాలి
10. విడిపోతే ..హైదరాబాద్ దూరం అవుతుంది..బతుకమలేం.. హైద్రాబాద్ లో ఉద్యోగాలు రావు.
జవాబు...హైద్రాబాద్ ఏపీలో ఒక జిల్లా.. ఏపీలో ఆరుజోన్లుంటే.. 4సీమాంద్రలో(1,4 జోన్లు), 2 తెలంగాణలో(5,6 జోన్లు) ఉన్నాయి. హైద్రాబాద్ 6జోన్ లో భాగం..ఇక్కడ స్తానికులే ప్రభుత్వఉద్యోగాలు వస్తాయి..కనుక, గవర్మెంట్ పోస్టులుండవు, ఇక ప్రైవేటు జాబ్స్ ఎక్కడైనా చేయ్యొచ్చు. సీమాంద్ర రాష్ట్రం వస్తే.. లక్షలాది ఉద్యోగాలు నిరుద్యోగాలకు వస్తాయి.. సీమాంద్రలకు వందలేళ్లుగా సొంత రాజధాని లేదు..కాబట్టి ఇప్పుడు సొంతరాజధాని నిర్మించుకునే అవకాశం వచ్చింది..సొ, విడిపోతే రెండు ప్రాంతాలు బాగుపడతాయనేది వాస్తవం..., జైతెలంగాణ.

తెలంగాణ ఉద్యోగ సంఘాల నేతలతో కేసీఆర్ భేటీ


 ఇవాళ మధ్యాహ్నం రెండున్నర గంటలకు తెరాస సెక్రటరీ జనరల్  కె.కేశవరావుతో, ఆ పార్టీ అధినేత కేసీఆర్ భేటీ అవుతున్నారు. ఎపీఎన్జీవోల సభ, తెలంగాణ బంద్, ఢిల్లీ పరిణామాలపై ప్రధానంగా చర్చ జరగనుంది.ఈ సమావేశంలో కేసీఆర్తో పాటు తెలంగాణ జేఏసీ అధ్యక్షుడు  కోదండరాం, ఉద్యోగ సంఘాల నేతలు దేవీప్రసాద్, శ్రీనివాస్ గౌడ్్, విఠల్లు పాల్గననున్నారు. ఎపీఎన్జీవోలకు దీటుగా హైదరాబాద్లో భారీ బహిరంగ సభ నిర్వహించాలన్న యోతనలో జేఎసీ ఉంది. ఎపీఎన్జీవోలు ఏదైతై ఎల్బీ స్టేడియం మీదుగా అవాస్తవాలను ప్రజలకు చెప్పారో.... అక్కడి నుంచే తెలంగాణ వాదాన్ని, ఉద్యోగులు నష్టపోతున్న తీరును వివరించాలన్న ఆలోచనలో ఉన్నారు. కేసీఆర్తో చర్చ తరువతా దీనిపై తుది నిర్ణయం తీసుకోనున్నారు.

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియలో రెండో దశ కూడా పూర్తయినట్లు తెలుస్తోంది.

 తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియలో రెండో దశ కూడా పూర్తయినట్లు తెలుస్తోంది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు కేబినెట్ నోట్ సిద్ధమైంది. దానికి యూపీఏ అధినేత్రి సోనియా గాంధీ ఆమోదం లభించాల్సి ఉంది. ప్రస్తుతం ఆమె అమెరికాలో ఉన్నారు. ఆమె తిరిగి రాగానే దాన్ని ఆమె ముందు పెట్టి రాజకీయ ఆమోదం పొందుతారని సమాచారం. ఆమె ఆమోదం లభించిన వెంటనే నోట్‌ను కేంద్ర మంత్రివర్గానికి పంపిస్తారని సమాచారం. ఈ మేరకు ఆదివారం పీటీఐ వార్తా సంస్థ ఓ కథనాన్ని వెలువరించింది. కేంద్ర హోం మంత్రి సుశీల్‌కుమార్ షిండే ఆదేశాల మేరకు ఆ శాఖ అధికారులు రాజ్యాంగ విధివిధానాల ప్రకారం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సంబంధించిన కేబినెట్ నోట్ రూపకల్పనను ఇప్పటికే పూర్తి చేశారని, ఇక దానికి రాజకీయ ఆమోదమే తరువాయని పిటిఐ వార్తాకథనం తెలిపింది.. తెలంగాణ నోట్ రెడీ: సోనియా కోసం వెయిట్ "కేబినెట్ నోట్‌ను మేం సిద్ధం చేసేశాం. రాజకీయ ఆమోదం కోసం ఎదురు చూస్తున్నాం'' అని హోం శాఖ సీనియర్ అధికారి ఒకరు అన్నట్లు పీటీఐ తెలిపింది. వైద్య చికిత్సల నిమిత్తం కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ ఈనెల రెండో తేదీన అమెరికా వెళ్లిన సంగతి తెలిసిందే. ఏడెనిమిది రోజుల్లో ఆమె తిరిగి వస్తారని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జనార్దన్ ద్వివేది చెప్పారు. ఆమె రాగానే అది ముందుకు కదులుతుందని సమాచారం. వాస్తవానికి కేబినెట్ నోట్ సిద్ధమైన తర్వాత దానిని న్యాయశాఖ పరిశీలనకు పంపించాలి. అయితే, సోనియా ఆమోద ముద్ర పడిన తర్వాతే దానిని న్యాయ శాఖకు పంపించాలని హోంశాఖ అధికారులు భావిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌ను విభజించి, తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) నిర్ణయించిన సంగతి తెలిసిందే. దీనిపై తీర్మానాన్ని సిద్ధం చేయాలని కేంద్ర ప్రభుత్వానికి సూచించింది. ఇందులో భాగంగానే కేంద్ర హోం శాఖ కేబినెట్ నోట్‌ను సిద్ధం చేసింది. నోట్ తయారవుతోందని, ఇందుకు 20 రోజులో.. 30 రోజులో ఎన్నిరోజులు పడుతుందో చెప్పలేనని సుశీల్ కుమార్ షిండే ఇటీవల మీడియా ప్రతినిధుల సమావేశంలో వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. ఆంటోనీ కమిటీ సిఫారసులను కూడా పరిగణనలోకి తీసుకుని కేబినెట్ నోట్‌ను తయారు చేస్తామని కూడా ఆయన చెప్పారు. అయితే, ఆంటోనీ కమిటీ ఇంకా నివేదిక ఇవ్వకముందే కేబినెట్ నోట్ సిద్ధమైపోయిందని ఆ శాఖ వర్గాలు తెలపడం విశేషం. కాగా, కేబినెట్ నోట్‌పై కేంద్ర మంత్రివర్గం ఆమోద ముద్ర వేయగానే ఆంధ్రప్రదేశ్ విభజనతో ఉత్పన్నమయ్యే సమస్యల పరిష్కారానికి మంత్రుల సంఘాన్ని ఏర్పాటు చేస్తారు. ఆ తర్వాత రాష్ట్ర విభజన తీర్మానాన్ని ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఆమోదానికి పంపుతారు.

తెలంగాణ నేతలు చంద్రబాబుకు షాక్ ఇస్తారా?

హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు సీమాంధ్రలో చేస్తున్న తెలుగువాడి ఆత్మగౌరవ యాత్ర పార్టీలో తీవ్ర పరిణామాలకు దారి తీసే ప్రమాదం కనిపిస్తోంది. చంద్రబాబు సమైక్యాంధ్రకు అనుకూలంగా మాట్లుడుతుండడంతో తెలంగాణ నేతలు ఇరకాటంలో పడ్డారని చెబుతున్నారు. తెలంగాణ నేతలు చాలా మంది పార్టీని వీడేందుకు సిద్ధపడుతున్నట్లు గత రెండు రోజులుగా వార్తలు వస్తున్నాయి. పదేళ్ల పాటు అధికారానికి దూరంగా ఉన్నాం, ఈసారి తెలంగాణలో పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం లేదని భావిస్తున్న ఎమ్మెల్యేలు కొందరు ఇతర పార్టీల వైపు చూస్తున్నారని అంటున్నారు. కొందరు ఎమ్మెల్యేలు కాంగ్రెస్, టిఆర్‌ఎస్‌ల వైపు చూస్తున్ననట్లు చెబుతున్నారు. అయితే వెంటనే వారు పార్టీలు మారేందుకు సిద్ధంగా లేరని, విభజన అంశంపై కేంద్రం తీసుకునే చర్యలను బట్టి నిర్ణయాలు ఉంటాయని టిడిపి సీనియర్ నాయకుడొకరు తెలిపారు. తమ నియోజక వర్గాల్లో కాంగ్రెస్, తెరాస నుంచి బలమైన నాయకులు లేని ప్రాంతాల్లో ఆ పార్టీల వైపు తెలుగుదేశం తెలంగాణ ప్రాంత నాయకులు ఆసక్తి చూపుతున్నారు. తాను కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్టు వస్తున్న వార్తల్లో వాస్తవం లేదని, తాను పార్టీని వీడే ప్రసక్తి లేదని తెలుగుదేశం పార్లమెంటు సభ్యుడు రమేష్ రాథోడ్ తెలిపారు. రాష్ట్ర విభజనతో టిడిపి జాతీయ పార్టీ అవుతుందని, రెండు ప్రాంతాల్లోనూ ఉంటుందని తెలిపారు. అయితే, చాలా మంది నాయకులు కాంగ్రెసు, తెరాస వైపు చూస్తున్నట్లు చెబుతున్నారు. విభజన ప్రక్రియ త్వరగా పూర్తి చేస్తే బాగుండేదని, కానీ కాంగ్రెస్ మాత్రం తమ పార్టీని దెబ్బ తీయాలని ఉద్దేశ పూర్వకంగానే జాప్యం చేస్తోందని టిడిపి నాయకులు అనుమానిస్తున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో తెలంగాణలో తాము వౌనంగా ఉండాల్సి రావడం, మరోవైపు చంద్రబాబు తెలంగాణను అడ్డుకున్నానని సీమాంధ్రలో ప్రచారం చేస్తుండడం తమకు ఇబ్బంది కలిగించే విషయాలే అని పార్టీ నాయకులు చెబుతున్నారు. ఒకటి రెండు నెలల్లో విభజన అంశం ఒక కొలిక్కి వస్తే అప్పటి పరిస్థితిని బట్టి కొంతమంది పార్టీ మారే అవకాశం లేకపోలేదని తెలంగాణకు చెందిన టిడిపి నాయకులు చెబుతున్నారు. టిఆర్‌ఎస్ కాంగ్రెస్‌లో విలీనం అవుతుందా? లేక పొత్తు పెట్టుకుంటుందా? అనే విషయం తేలాలని, విలీనం అయితే కొంతలో కొంత టిడిపి పరిస్థితి మెరుగు పడుతుందని ఎమ్మెల్యేలు చెబుతున్నారు. ఆ రెండు పార్టీలు కలిసి పోటీ చేస్తే బలమైన ప్రతిపక్షంగా టిడిపి నిలుస్తుందని టిడిపి ఎమ్మెల్యేలు అంటున్నారు.

మిలియన్ మార్చ్ ...?

మిలియన్ మార్చ్ తెలంగాణ వాదులు తెలంగాణ కాంక్షను మాత్రమే కాదు. ఆధిపత్య భావజాలాన్ని ఎదిరించేందుకు, సాంస్కృతిక పరిరక్షణకు నిర్వహించారు. మిలియన్్ మార్చ్ అంటే సీమాంధ్రులకు విగ్రహాల విధ్వంసంగానే భావిస్థారు. కాని ఒకటి గుర్తించాల్సింది
ఉంది.  జర్మన్ నియంత  అడాల్ఫ్ హిట్లర్ విగ్రహాన్ని సైతం...  రెండో ప్రపంచయుద్ధం కాలంలో మిత్రపక్షాల కూటమి పడగొట్టింది. అంటే దానర్థం జర్మనీ దేశం పైనో.... అక్కడి ప్రజలపైనో  ద్వేషం కాదు.  పరిపాలన, రాజ్యవిస్తరణ కాంక్షపై ద్వేషం. అదే రీతిలో తెలంగాణ వాదుల మిలియన్ మార్చ్ లో విగ్రహాల విద్వసం... ఆ నేతలపై కాదు. రాజకీయ, సాంస్కృతిక ఆధిపత్యం పైనే. ఇక తాజాగా ఎపీఎన్జీవోలు, లగడపాటి లాంటి నేతలు ఎవరి ఆధిపత్యంపై మిలియన్ మార్చ్ చేస్తారు. ఎవరి ఆధిపత్యం కింద ఎవరు ఉన్నారు.? ఎవరి ఆధిపత్యాన్ని సవాల్ చేస్తూ మిలియన్ మార్చ్.