Saturday, September 14, 2013

హైదరాబాద్ ఉమ్మడి రాజధాని కాదు... తాత్కాలికం మాత్రమే....టీజేఏసీ

                                               హైదరాబాద్ తాత్కాలిక  రాజధాని మాత్రమే.....



 హైదరాబాద్ ను పదేళ్లపాటు తాత్కాలిక రాజధానిగా అంగీకరించ వద్దన్న ఒత్తిడి జేఏసీ నేతలపై పెరుగుతోంది. ఉద్యోగులు, విద్యార్థులు, తెలంగాణ వాదులు, జిల్లాల జేఏసీ నేతల నుంచి కోదండరాం, సహా ఇతర జేఏసీ ముఖ్యనేతలకు ఈ మేరకు అధిక సంఖ్యలో ఫోన్లు, ఎస్.ఎం.ఎస్ ల తాకిడి రోజు పెరుగుతోంది. ఎపీఎన్జీవోల హైదరాబాద్ సభ తర్వాత ఇది మరింత ఎక్కువయిందని నేతలు చెబుతున్నారు. పదేళ్ల రాజధానిగా ఇక ఏమాత్రం అంగీకరించవద్దని, కేవలం తాత్కాలిక రాజధానిగా ఎలాంటి టైంబాండ్ లేకుండా కేంద్రంపై ఒత్తిడి తేవాలని జేఏసీ నేతలు తెలంగాణ నుంచి వివిధ వర్గాలు ఒత్తిడి చేస్తున్నాయి. ఏపీఎన్జీవోల సభ సందర్భంగా విద్యార్థులపై పోలీసులు లాఠీ ఛార్జి, విద్యార్థి నేత బాలరాజు గౌడ్ పై  ఏపీఎన్జీవోల సభకు వచ్చిన వారి దాడి, ఆ సభలో ప్రసంగాలు, కానిస్టేబుల్ శ్రీనివాస్్ గౌడ్ దాడి, వంట ిఅంశాలు తెలంగాణ వాదుల్లో ఆగ్రహాన్ని నింపాయి. నేతలు సైతం పదేళ్ల ఉమ్మడి రాజధానికి అంగీకరించ కూడదన్న అభిప్రాయంలో ఉన్నారు. ఇప్పుడు కేంద్రం చెప్పిన వాటన్నింటికి మౌనంగా ఉంటే ఉమ్మడి రాజధాని నుంచి శాశ్వత రాజధానిగా కూడా ప్రకటించే అవకాశం ఉందని భావిస్తున్నారు.  ఇక హైదరాబాద్ ఆదాయం, శాంతిభధ్రతల అంశాల వంటి వాటిపైన సీమాంధ్ర నేతలు హాక్కులు కోరతారని.... ఇందుకు తాము సిద్ధంగా లేమని జేఏసీ నేతలు చెబుతున్నారు. అందుకే తాత్కాలిక రాజధానిగానే అంగీరించేందుకు సిద్ధమన్నది జేఏసీ ముఖ్య నేతల యోచన.

No comments: