Saturday, September 14, 2013

జేఏసీ నేతలు ఢిల్లీ పర్యటన

                                           తెలంగాణ రాజకీయ జేఏసీ విస్తృత స్థాయి సమావేశం




 తెలంగాణ రాజకీయ ఐకాస విస్తృత స్థాయి సమావేశం నాచారంలోని నోమా  ఫంక్షన్ హాలులో ప్రారంభమైంది. ఈ సమావేశానికి జేఏసీ ఛైర్మన్ కోదండరాం, తెరాస నేతలు కేకే, శ్రవణ్, ఈటెల రాజేందర్, ఉద్యోగ సంఘాల నేతలు దేవీప్రసాద్, శ్రీనివాస్ గౌడ్, విఠల్,  తెలంగాణ మాల మహనాడు అధ్యక్షుడు అద్దంకి దయాకర్, తెలంగాణ పది జిల్లాల జిల్లా జేఏసీ అధ్యక్షులు పాల్గొన్నారు.
ఢిల్లీ పర్యటనపై చర్చ...
 జేఏసీ నేతలు ప్రస్తుత తాజా రాజకీయ పరిణామాల నేపధ్యంలో ఢిల్లీకి వెళ్లి మరో మారు వివిధ పార్టీల జాతీయ నేతలను కలవాలని నిర్ణయించుకున్నారు. తెలంగాణకు అనుకూలంగా ఉన్న పార్టీల నేతలను కలిసి కాంగ్రెస్ తెలంగాణ బిల్లు పెట్టాలా ఒత్తిడి తేవాలని కోరనున్నారు. అయితే ఎవరేవరని కలవాలని.... ఢిల్లీకి వెళ్లే బృందంలో సభ్యులు ఎవరు ఉండాలన్న అంశాలపై ఇవాళ జరిగే  జేఏసీ సమావేశంలో చర్చించనున్నారు.
సెప్టెంబర్ ౩౦వ తేదీ సదస్సు
 ఈ నెల ౩౦వ తేదీన హైదరాబాద్ లోని ఎన్టీఆర్ స్టేడియంలో నిర్వహించ తలపెట్టిన స్వాభిమాన్ సదస్సు నిర్వహణపైన ఇవాళ్టి సమావేశంలో నేతలు చర్చిస్తారు. ఎన్టీఆర్ స్టేడియంలో ప్రభుత్వం సదస్సు నిర్వహణకు అనుమతి ఇస్తుందా..? లేదా...? ఇవ్వకపోతే సదస్సు వేదిక హైదారాబాద్లో మరో చోట ఎక్కడ నిర్వహించాలన్న అంశాలు... ఈ వేదిక నుంచి  కేంద్ర ప్రభుత్వం ముందు ఎలాంటి డిమాండ్ ఉంచాలి...... ఈ వేదిక ద్వారా తెలంగాణ ప్రజలకు ఎలాంటి సందేశం అందించాలన్న అంశాలపైన నేతలు చర్చిస్తారు. లక్ష మందితో నిర్వహించాలనుకున్న సదస్సులో రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాలు, ఉద్యోగ సంఘాల నేతల పాత్ర ఎలా..? ఉండాలి అన్న అంశాలపై జేఏసీ నేతలు ఓ నిర్ణయానికి రానున్నారు.

No comments: