Friday, September 13, 2013

                             హైదరాబాద్ పదేళ్ల ఉమ్మడి రాజధానిపై తెలంగాణ జేఏసీ సమీక్ష..



 తెలంగాణ జేఏసీ విస్తృత స్థాయి సమావేశం నాచారంలోని నోమా  ఫంక్షన్ హాలులో శనివారం జరగనుంది.  ఈ సమావేశంలో తెలంగాణలోని పది జిల్లాల జేఏసీ నేతలు హాజరవుతారు. జేఏసీ ఛైర్మన్ కోదండరాం నేతృత్వంలో జరిగే ఈ విస్తృత స్థాయి సమాశంలో ఉద్యోగ సంఘాల నేతలు దేవీప్రసాద్, శ్రీనివాస్ గౌడ్,విడల్, పది జిల్లాల జేఏసీ నేతలు హజరవనున్నారు. ఇక తెరాస అధ్యక్షుడు కేసీఆర్, బీజేపీ అధ్యక్షుడు కిషన్  రెడ్డి, న్యూడెమెక్రసీ నేతలు సూర్యం,గోవర్థన్ సైతం హాజరవనున్నారు.ఈ సమావేశం రెండు విడతలుగా జరగనుంది. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు జిల్లా జేఏసీ నుంచి సలహాలు,సూచనలను స్వీకరిస్తారు. ఉద్యమ తీరుతెన్నులు, హైదరాబాద్ పదేళ్ల ఉమ్మడి రాజధానిగా అంగీరించాలా వద్దా... అన్న అంశంపైనే ప్రధానంగా చర్చిస్తారు. హైదరాబాద్ లో ఏపీఎన్జీవోల సభ తర్వాత జిల్లా జేఏసీల నుంచి కోదండరాం సహా జేఏసీ ముఖ్యనేతలపై  హైదరాబాద్ ను పదేళ్ల ఉమ్మడి రాజధానిగా  అంగీకరించవద్దని  ఒత్తిడి మొదలయింది. దీంతో జేఏసీ నేతలు పునారాలోచనలో పడ్డారు. ఈ సమావేశంలో చర్చించాక హైదరాబాద్ ను ఉమ్మడి రాజధానిగా అంగీకరించబోమని  చెప్పింనా ఆశ్చర్యంలేదని జేఏసీ నేతలు తమ అంతర్గత సంభాషణల్లో చెబుతున్నారు. ఇక మధ్యాహ్నం నుంచి జరిగే సమావేశంలో జిల్లా జేఏసీల నుంచి  వచ్చిన సలహాలు - సూచనలపై చర్చిస్తారు. ఆ తరువాత హైదరాబాద్ లో ఈ నెల ౩౦వ తేదీన నిర్వహించ తలచిన సదస్సు పనులపై చర్చించనున్నారు. ఈ సదస్సుకు తెలంగాణ స్వాభిమాన సదస్సు అన్న పేరుతో పిలవాలని ఆలోచిస్తున్నారు. అయితే దీనిపైన చర్చిస్తారు. ఇక  ఈ సదస్సు వేదిక  ఎన్డీఆర్ స్డేడియంలో నిర్వహించాలని తలస్తున్నారు. అనుమతులు రాకపోతే  ప్రత్యామ్నాయ వేదికలపైన చర్చిస్తారు.

No comments: